Foriegn Education | విదేశాల్లో చదవాలని ఆశపడుతున్నారా.. అయితే సోషల్ మీడియాను ఒళ్లు దగ్గరపెట్టుకుని వాడాల్సిందే!
Foriegn Education | అమెరికాకో.. ఇతర దేశాలకో.. చదువుకొనేందుకు వెళ్తున్నారా? అయితే సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. విద్వేషపు పోస్టులు పెట్టినా, మరొకరిని ద్వేషించినట్టు తేలినా విదేశాల్లో చదివే అవకాశాన్ని కోల్పోయినట్టే.
Foriegn Education | హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): అమెరికాకో.. ఇతర దేశాలకో.. చదువుకొనేందుకు వెళ్తున్నారా? అయితే సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. విద్వేషపు పోస్టులు పెట్టినా, మరొకరిని ద్వేషించినట్టు తేలినా విదేశాల్లో చదివే అవకాశాన్ని కోల్పోయినట్టే. ఎన్నో ఆశలతో ఆ దేశాల ఎయిర్‌పోర్టుల్లో అడుగు పెట్టినా, ఈ కారణాలతో వెనక్కి తిరిగి రావాల్సిందే. విదేశాల్లో చదువుకోవాలనునే విద్యార్థులు సోషల్‌మీడియాలో పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలే 21 మంది భారతీయ విద్యార్థులు అమెరికా నుంచి వెనుదిగిన విషయం తెలిసిందే. వీరిలో కొందరి సెల్ఫోన్లను భద్రతాసిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. ఆయా ఫోన్లను పరిశీలించారు. వాట్సాప్ చాట్‌ను మాత్రమే పరిశీలించగా, పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం విద్యార్థులు వెతికినట్టు తేలింది. అదే తరహాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను సైతం వెతికే అవకాశం ఉన్నట్టు కన్సల్టెన్సీల నిర్వాహకులు చెప్తున్నారు. ఆ సమయంలో విద్వేషం కలిగించే పోస్టులు దొరికినా, తిరస్కరించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అంచనా ప్రకారం 1.5 లక్షల హేట్స్పీట్ సైట్లను గుర్తించారు. వీటిని ట్యాగ్చేసినా.. కామెంట్లు పెట్టినా తిరస్కరించే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు.
జాగ్రత్తలివీ..
- ఇతరుల జీవితాల గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా, అవాస్తవ అభిప్రాయాలను పోస్టు చేసినా ఇబ్బందులు తప్పవు. జాతి, లింగ వివక్షకు తావునిచ్చే పోస్టులు పెట్టినట్టు తేలినా వెనక్కి పంపించే అవకాశాలుంటాయి.
- కులం, మతం, ప్రాంతీయ తత్వంపై పోస్టులు పెట్టినా ఇబ్బందులు తప్పవు.
- టోఫెల్, పీటీఈ, డ్యూలింగో సర్టిఫికెట్లు ఫేక్‌వి కావొద్దు. భద్రతా సిబ్బంది ఒక్కోసారి కమ్యూనికేషన్ ఆధారంగా అసలువో, నకిలీవో నిర్ధారించే అవకాశాలుంటాయి.
పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి
యూఎస్‌కు వీసా దొరికినా, అక్కడికి చేరుకున్నాక బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనుమతిస్తేనే, ఇమ్మిగ్రేషన్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఎంట్రీ దొరికినట్టు. వాస్తవానికి ఆయా దేశంలో ఎంట్రీకి ఇదే చివరి దిశ. ఒక్కోసారి భద్రతాసిబ్బంది సెల్‌ఫోన్‌ను వారి ఆధీనంలోకి తీసుకుని వడబోస్తారు. పోస్టులు, కమ్యూనికేషన్లను పరిశీలిస్తారు. ఇలాంటప్పుడు ఏదై నా అనుమానం వస్తే వెంటనే తిరస్కరిం చి వెనక్కి పంపించే అవకాశాలుంటాయి.
– హరికాంత్, కన్సల్టెంట్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

