హైదరాబాద్: పీజీ మెడికల్ (PG medical) కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలివిడత ప్రవేశాలకు మంగళవారం నుంచి ఈ నెల 27 మధ్యాహ్నం 2 గంటల వరకు తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. వర్సిటీ పరిధిలోని కళాశాలలు, నిమ్స్ మెడికల్ కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. కాళోజీ వర్సిటీ వెబ్సైట్లో సీట్ల ఖాళీల వివరాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 8 గంటలకు వెబ్ఆప్షన్లు ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకు వెబ్సైట్ www.knruhs.telangana.gov.inను చూడవచ్చన్నారు.