న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 15 వరకు అందుబాటులో ఉంటాయి. డిగ్రీ, ఐటీఐ చేసినవారు అర్హులు. మొత్తం 3614 పోస్టులకు నియామకాలు చేపడుతున్నది. సౌథర్న్ సెక్టార్లో 694 పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 3614
ఇందులో సౌథర్న్ సెక్టార్ 694, నార్తర్న్ సెక్టార్ 209, సెంట్రల్ సెక్టార్ 228, ఈస్టర్న్ సెక్టార్ 744, వెస్టర్న్ సెక్టార్ 1434 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీలో బీకామ్, బీఏ లేదా బీబీఏ, ఐటీఐ చేసి 24 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: డిగ్రీ, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 15
వెబ్సైట్: www.ongcindia.com