నిపుణ – వార్తల్లో వ్యక్తులు
ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆమె జన్మించారు. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషణ్, 1999లో పద్మవిభూషణ్
లతా మంగేష్కర్
ప్రఖ్యాత గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న మరణించారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఆమె జన్మించారు. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే, 1997లో మహారాష్ట్ర భూషణ్, 1999లో పద్మవిభూషణ్, 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2001లో భారతరత్న, 2007లో ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం, 2009లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు లభించాయి.
దినేష్ ప్రసాద్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కు కొత్త డైరెక్టర్‌గా దినేష్ ప్రసాద్ సక్లానీ నియమితులైనట్లు అధికారులు ఫిబ్రవరి 7న తెలిపారు. 2020, నవంబర్‌లో పదవీకాలం ముగిసిన హుషికేశ్ సేనాపతి స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 ఏండ్లు లేదా ఆయనకు 65 ఏండ్లు వచ్చే వరకు ఉంటారు.
శాంతిశ్రీ
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్‌చాన్స్‌లర్ (వీసీ)గా శాంతిశ్రీ ధూళిపూడి ఫిబ్రవరి 7న నియమితులయ్యారు. దీంతో జేఎన్‌యూ వీసీగా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. ప్రస్తుతం ఆమె సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ వీసీగా పనిచేస్తున్నారు.
ప్రవీణ్‌కుమార్ సోబ్జీ
నటుడు, క్రీడాకారుడు ప్రవీణ్‌కుమార్ సోబ్జీ ఫిబ్రవరి 7న మరణించాడు. క్రీడాకారుడిగా ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు సాధించాడు. 1947, డిసెంబర్ 6న పంజాబ్ రాష్ట్రం టార్న్ తరుణ్ జిల్లా సర్హలి కలాన్‌లో జన్మించిన ఆయన దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన మహాభారత్ సీరియల్లో భీముడిగా నటించాడు.
రాంసింగ్
‘ఎమినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2021’కు లకావత్ రాంసింగ్‌ను ఎంపిక చేసినట్లు నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ (నెసా) అధ్యక్షుడు జావెద్ అహ్మద్ ఫిబ్రవరి 8న ప్రకటించారు. రాంసింగ్ హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సుల నిర్వహణ, గోపాత మిత్రలకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనలియర్ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బొవైన్ బ్రీడింగ్‌లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు.
ఉన్నికృష్ణన్ నాయర్
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) కొత్త డైరెక్టర్‌గా ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఇస్రో చైర్మన్‌గా నియమితులైన ఎస్ సోమనాథ్ స్థానంలో ఆయన ఎంపికయ్యారు. వీఎస్ఎస్సీలో 1985లో చేరిన ఆయన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

