న్యూఢిల్లీ : జులై 17న నీట్ పరీక్ష జరగనుండగా అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్ధులకు నీట్ 2022 అడ్మిట్ కార్డులను త్వరలో విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్ధులకు అడ్మిట్ కార్డ్ లింక్ అందుబాటులోకి రానుంది.
నీట్ యూజీ అడ్మిట్ కార్డు 2022 వెబ్సైట్లో విడుదలైన వెంటనే విద్యార్ధులు డౌన్లోడ్ చేసుకునేందుకు అడ్మిట్ కార్డు లింక్ యాక్టివేట్ అవుతుంది. అడ్మిట్ కార్డులో పరీక్ష వివరాలు, పరీక్ష రోల్ నెంబర్, విద్యార్ధి పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి పూర్తి వివరాలు ఉంటాయి. విద్యార్ధులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తూ తమ నీట్ ఖాతాలోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక నీట్ యూజీ పరీక్షను జులై 17న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది.