హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలో MBBS, BDS యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ-2021లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ఆదివారం నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.knruhs.telangana.gov.in, tsbdsadm.tsche.inలో చూడవచ్చు.