JEE Main | జేఈఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం.. జనవరిలో 24 నుంచి ఎగ్జామ్స్
దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)తో ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 30న రాత్రి 9 గంటలకు ముగియనుంది.
న్యూఢిల్లీ: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Main- 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్ 1న)తో ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 30న రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి. ఆన్లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్-CBT) పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది.
జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. బీఈ (BE), బీటెక్ (B.Tech) కోర్సుల కోసం పేపర్-1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల కోసం పేపర్-2 నిర్వహిస్తారు. దరఖాస్తులు బుధవారం ప్రారంభమయ్యాయి. నవంబర్ 30న అప్లికేషన్లు ముగుస్తాయి. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తులు: నవంబర్ 1
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 30
ఫీజు చెల్లింపునకు చివరితేదీ: నవంబర్ 30 (రాత్రి 11.50 గంటల వరకు)
పరీక్ష కేంద్రాల (నగరాలు) ప్రకటన: 2024, జనవరి రెండో వారంలో
అడ్మిట్‌కార్డులు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు
ఆన్లైన్ పరీక్షలు: 2024, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు
పరీక్ష ఫలితాలు: 2024, ఫిబ్రవరి 12
వెబ్సైట్: www.nta.ac.in, https://jeemain.nta.ac.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

