న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 90 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంజినీర్, సబ్ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 90
ఇందులో ఇన్స్పెక్టర్ 1, సబ్ ఇన్స్పెక్టర్ 57, జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) 32 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ, మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్ల వయస్సు మిచినవారై ఉండకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 30
వెబ్సైట్: www.rectt.bsf.gov.in or bsf.gov.in