వచ్చే నెలలో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్.. 2 వేలకుపైగా పోస్టులు!
ఐబీపీఎస్| ఆర్ఆర్బీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలవగా, మరో భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమయ్యింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలను భర్తీ చేసే ఐబీపీఎస్ వచ్చే నెలలో క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్షలను ఆగస్టు/సెప్టెంబర్‌లో నిర్వహించనుందని సమాచారం.

న్యూఢిల్లీ: బ్యాంకింగ్ ఉద్యోగాలకోసం సన్నద్ధమయ్యేవారికి శుభవార్త. ఇప్పటికే ఆర్ఆర్బీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలవగా, మరో భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమయ్యింది. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలను భర్తీ చేసే ఐబీపీఎస్ వచ్చే నెలలో క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్షలను ఆగస్టు/సెప్టెంబర్‌లో నిర్వహించనుందని సమాచారం. సో.. ఆర్ఆర్బీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు పనిలోపనిగా క్లర్క్ కోసం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.
ఐబీపీఎస్ గతేడాది వివిధ బ్యాంకుల్లో 2557 పోస్టులను భర్తీ చేసింది. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ మహారాష్ట్రలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అటుఇటుగా అంతే మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
పరీక్ష విధానం: ఉద్యోగ నియామక పరీక్ష రెండు ఫేజుల్లో ఉంటుంది. అవి ప్రిలిమినరీ, మెయిన్స్. ఇవి రెండూ కంప్యూటర్ ఆధారిత పరీక్షలే.
ప్రిలిమినరీ.. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100
దరఖాస్తులు ప్రారంభం: జూలైలో
ప్రిలిమ్స్: ఆగస్టు 28. 29, సెప్టెంబర్ 4, 5
మెయిన్స్: అక్టోబర్ 31
వెబ్సైట్: ibps.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Clerk
- IBPS
- Recruitment
- ఐబీపీఎస్
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

