డేటా నేర్చుకుందాం.. డెవలప్ అవుదాం!

రోజు ఉపయోగించే యూట్యూబ్‌లో ఏదైనా సైన్స్ వీడియో చూస్తే తరువాత నుంచి నచ్చడానికి ఎకువ ఆసారం ఉండే సైన్స్ వీడియోలు కనిపిస్తుంటాయి కదా. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిల్లో కూడా ఏదైనా ఒక వస్తువు గురించి చూస్తే తరువాత నుంచి అటువంటి వస్తువులే కనిపిస్తాయి. ఇలా ఇవన్నీ సాధ్యపడేది AI/ML ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు నిర్మించే సాఫ్ట్వేర్ల వల్లనే. ఈ సాఫ్ట్వేర్లు పనిచేయడానికి అత్యంత కీలకమైనది డేటా. ఒక వాహనం నడవాలంటే ఇంధనం ఎంత ముఖ్యమో ఈ సాఫ్ట్వేర్స్కి డేటా అనేది అంత ముఖ్యం.
డేటా అంటే ఏంటి?
ఏదైనా ఒక కంపెనీ యాప్ లేదా వెబ్సైట్లో లాగిన్ కోసం ఇచ్చే వ్యక్తిగత వివరాల దగ్గర నుంచి రోజు వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిల్లో పెట్టే పోస్టులు, స్టోరీలు, యూట్యూబ్‌లో చూసే వీడియోలు, అమెజాన్‌లో ఆర్డర్ చేసుకునే వస్తువులు, జీ మెయిల్లో పంపించే ఫైల్స్ ఇలా వీటన్నిటిని డేటా అనవచ్చు.
ఒక నిమిషంలో..
ప్రపంచవ్యాప్తంగా 2020 సంవత్సరంలో కేవలం ఒక్క నిమిషంలో వాట్సాప్‌లో సుమారు నాలుగు కోట్లకు పైగా మెసేజ్‌లు పంపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల డబ్భు వేలకు పైగా స్టోరీలు, యూట్యూబ్‌లో నలభై ఐదు లక్షల వీడియోలు వీక్షించారు. ఇలా ఇంటర్నెట్లో వివిధ వెబ్సైట్లలో ఒక నిమిషంలోనే చాలా డేటా అనేది తయారవుతుంది.
చిన్న చిన్న అంకుర సంస్థల నుంచి మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల వరకు అందరికీ వారి బిజినెస్ ఎదగడానికి డేటా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇంత భారీ మొత్తంలో ఉన్న డేటాని కంపెనీలు ఎలా మేనేజ్ చేస్తాయి?
దీని కోసం కంపెనీలు డేటాబేస్ టెక్నాలజీలను ఉపయోగిస్తారు.
డేటాబేస్ అంటే?
డేటాబేస్ అంటే మన దగ్గర ఉన్న డేటాని క్రమపద్ధతిలో పెట్టుకోవడం. ఆ డేటాబేస్‌లో డేటాని స్టోర్ చేయడానికి, డేటాను యాక్సెస్ చేయడానికి, ముఖ్యమైన డేటాని చాలా సురక్షితంగా ఉంచడానికి అలానే ఆ డేటాని మేనేజ్ చేయడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌నే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీబీఎంఎస్) అంటారు.
ఒక యాప్ లేదా వెబ్‌సైట్‌ని ఒకేసారి లక్షల మంది వాడుతూ ఉంటారు. ఉదాహరణకు ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే బిగ్ బిలియన్ డే. ఒకేసారి వెబ్సైట్లోకి అంతమంది వచ్చినా వెబ్సైట్ నెమ్మదించకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయాలి కదా. ఇలా పనిచేసేలా చేయడానికి కంపెనీలు డేటాబేస్ టెక్నాలజీల పైనే ఆధారపడతాయి.
అలాగే ఒక కంపెనీ దగ్గర ఉండే డేటాలో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ట్రాన్సాక్షన్లు, ఫొటోలు, వీడియోలు చాలా సురక్షితంగా ఉంచాల్సిన సమాచారం ఉంటుంది. ఇటువంటి ముఖ్యమైన డేటాని ఎవరు యాక్సెస్ చేయగలరు?, ఎంతవరకు యాక్సెస్ చేయగలరు? అని అనుమతులు పెడుతూ డేటాని సురక్షితంగా ఉంచడానికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉపయోగపడతాయి.
లక్షల్లో జీతాలు
పే సేల్ సంస్థ ప్రకారం ఇండియాలో డేటా సైంటిస్ట్‌ల వేతనం సుమారు ఎనిమిది లక్షలు, అమెరికాలో అయితే డెభ్బై లక్షలు. ఇండియాలో డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్‌లకు జీతం సుమారు ఆరు లక్షలు, అమెరికాలో అయితే సుమారు యాభై లక్షలు. ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా SQLలో నైపుణ్యం అనేది తప్పనిసరి.
వీరు ఏం చేస్తారు?
అప్లికేషన్ డెవలపర్
నిత్యం ఉపయోగించే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జొమాటో, ట్విట్టర్ వంటి వాటిని అప్లికేషన్స్ (యాప్స్) అంటాం. వీటిని డెవలప్ చేసే వారిని అప్లికేషన్ డెవలపర్ అంటారు. ఏ అప్లికేషన్ తీసుకున్నా డేటా అనేది చాలా ముఖ్యం. ఇలా డేటాని ఉపయోగించి అప్లికేషన్ని బిల్డ్ చేయడం, డేటాని నిర్వహించడం వంటివి ఈ అప్లికేషన్ డెవలపర్లు చేస్తారు. ఉదాహరణకు వాట్సాప్‌లో మెసేజ్ పంపిస్తే దానిని సేవ్ చేయడం, ఓపెన్ చేసినప్పుడు ఆ మెసేజ్‌లను చూపించడం వంటివి. అలాగే అమెజాన్‌లో పెట్టే ఆర్డర్లను సేవ్ చేయడం, కావాలన్నప్పుడు ఆ ఆర్డర్ వివరాలు, డెలివరీ స్టేటస్ చూపించడం వంటివి జరిగేలా ఈ అప్లికేషన్ డెవలపర్లు సాఫ్ట్వేర్లను రూపొందిస్తారు.
డేటా సైంటిస్ట్
డేటా సైంటిస్ట్‌లు వివిధ రకాల ముఖ్యమైన డేటాను సేకరించి వాటి నుంచి ఇన్సైట్స్ తెస్తారు. ఈ ఇన్సైట్స్ని ఉపయోగించి ఆ కంపెనీ చకటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒక కంపెనీ ఏదైనా కొత్త ప్రొడక్ట్ మారెట్లోకి విడుదల చేయాలన్నా లేదా ఒక కొత్త ఫీచర్ తీసుకురావాలన్నా ఇలా ఏ పని చేయాలన్నా డేటా పై ఆధారపడే నిర్ణయాలు తీసుకుంటారు. ఉదహరణకు కస్టమర్లు ఎటువంటి వస్తువులు ఎకువ కొంటున్నారని పరిశీలించి వాటిని మళ్లీ కొనేలా ఆఫర్లు ఇవ్వడం వంటివి. ఇలా కంపెనీ ఎదుగుదలలో డేటా సైంటిస్ట్‌లు కీలక పాత్ర పోషిస్తారు.
డేటాబేస్ టెక్నాలజీలు నేర్చుకోవడం ఎలా?
డేటాబేస్ టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి లక్షల్లో వేతనాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఉడెమి, కోర్సెరా వంటి వాటిలో కూడా డేటాబేస్ టెక్నాలజీలను నేర్చుకోవచ్చు. నెక్ట్స్‌వేవ్ సీసీబీపీ టెక్ 4.0 ఇంటెన్సివ్ ప్రోగ్రాం ద్వారా డేటాబేస్ టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తూ ఇండస్ట్రీకి సిద్ధం చేస్తుంది. ఈ ప్రోగ్రాంతో కేవలం 4.5 నెల్లోనే సంవత్సరానికి 4.5 నుంచి 9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. ఈ ప్రోగ్రాం గురించి ccbp.in/intensive http://ccbp.in/intensive వెబ్సైట్లో వివరాలు చూడవచ్చు. మరిన్ని వివరాల కోసం 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. support@nxtwave.techకి మెయిల్ పంపండి.
రకాలు
డేటాను స్టోర్ చేయడానికి ఉపయోగించే డేటాబేస్‌లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.
1. రిలేషనల్ డేటాబేస్
ఏదైనా ఒక డేటాను టేబుల్ (పట్టిక) ఫార్మాట్లో స్టోర్ చేస్తే దానిని రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఇటువంటి డేటాబేస్లను మేనేజ్ చేయడానికి వాడే సాఫ్ట్‌వేర్‌ని రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు.
Example: Oracle, MySQL, SQL Server, IBM DB2, PostgreSQL, SQLite, etc.
- నాన్ రిలేషనల్ డేటాబేస్ (NoSQL Database)
కొన్ని అవసరాలకు తగ్గట్టుగా డేటాను టేబుల్ (పట్టిక) ఫార్మాట్లో కాకుండా కొన్ని నిర్దిష్ట పద్ధతుల్లో స్టోర్ చేస్తారు. వీటిని నాన్ రిలేషనల్ డేటాబేస్ అంటారు. దీనిని మేనేజ్ చేయడానికి నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు.
Examples: MongoDB, Elasticsearch, Couch DB, DynamoDB, Cassandra, Redis etc.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా వరకు కంపెనీలు రిలేషనల్ డేటాబేస్‌నే ఎకువగా ఉపయోగిస్తాయి. కాబట్టి ఏదైనా ఒక రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆర్డీబీఎంఎస్) నేర్చుకోవడం చాలా అవసరం. - SQL అంటే ఏంటి?
ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఆర్డీబీఎంఎస్)లో డేటాని స్టోర్ చేయడానికి, డేటాని మార్చడానికి లేదా తొలగించడానికి SQL అనే లాంగ్వేజ్ వాడుతాం.
SQL అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. దీనిని SEQUEL అని కూడా అంటారు.
టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎటువైపు వెళ్లాలన్నా ఈ డేటాబేస్, SQL నైపుణ్యాలు ఉండటం చాలా అవసరం. ఎంతో డిమాండ్ ఉన్న డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ వంటి మరిన్ని ఉద్యోగాలకు SQLలో నైపుణ్యం తప్పనిసరి. SQL అనేది నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆంగ్ల భాషని పోలి ఉంటుంది.
ఐబీఎం, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే కాకుండా ఇండస్ట్రీలో ఆర్డీబీఎంఎస్తో పనిచేసే ప్రతి కంపెనీ కూడా ఈ SQLని ఉపయోగిస్తారు.
డేటా మనం చేసే ప్రతి పనికి శక్తినిస్తుంది
- జెఫ్ వెయినర్, Ex సీఈవో లింక్డ్ ఇన్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- database
- Education News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

