సమయానుకూలంగా ఎన్నుకునేవి.. నిరంతరం పని చేసేవి
శాసనాలు రూపొందించటం, విత్త పాలన, పరిపాలనను పర్యవేక్షించడం పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య విధి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిణామం, నానాటికీ సాంకేతికమవుతున్న పాలనా ప్రక్రియ మొదలైన అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తెస్తున్నాయి.
- గ్రూప్స్ ప్రత్యేకం పాలిటీ
శాసనాలు రూపొందించటం, విత్త పాలన, పరిపాలనను పర్యవేక్షించడం పార్లమెంటరీ వ్యవస్థలో ముఖ్య విధి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిణామం, నానాటికీ సాంకేతికమవుతున్న పాలనా ప్రక్రియ మొదలైన అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తెస్తున్నాయి. అందువల్ల పార్లమెంటు తరఫున నిపుణులైన, సమర్థులైన కొంతమంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిపాలనపై నిరంతర నియంత్రణ కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వ పాలనపై, ప్రభుత్వ విత్త నిర్వహణపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించడానికి ఈ కమిటీలు ఉపయోగపడుతాయి.
- భారత రాజ్యాంగంలో పార్లమెంటు కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ప్రకరణ 88, 105లో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది.
- స్వాధికారాలను ప్రస్తావించిన ఈ ప్రకరణలో స్వాధికారాలు పార్లమెంటు కమిటీలకు కూడా వర్తిస్తాయని పేర్కొనడం జరిగింది.
- ఈ కమిటీలు సభ చేత ఎన్నుకోబడతాయి లేదా సభాధ్యక్షుల చేత ఎంపిక చేయబడతాయి.
- ప్రతి కమిటీ ఒక చైర్మన్ అధ్యక్షతన పని చేస్తుంది.
లక్షణాలు – నిర్మాణం
- కమిటీ తన నివేదికను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు సమర్పిస్తుంది.
- ప్రతి కమిటీ లోక్‌సభ/రాజ్యసభల చేత సమకూర్చిన కార్యాలయాన్ని వినియోగించుకుంటుంది.
- పార్లమెంటరీ కమిటీ సభ్యత్వం ఆయా పార్టీల సంఖ్యా బలానికి అనుగుణంగా నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఉంటుంది.
- పార్లమెంటు కమిటీల్లోని సభ్యులను ఆయా సభల్లో ఒక తీర్మానం ద్వారా ఎన్నుకోవడంగాని లేదా సభాధ్యక్షుల చేత నియమించబడటం గాని జరుగుతుంది.
- ఆర్థిక కమిటీలోని సభ్యులందరూ నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఎన్నికవుతారు.
- ఈ కమిటీల చైర్మన్‌ను సంబంధిత సభాధ్యక్షుడు నియమిస్తారు. ఒకవేళ సభాధ్యక్షుడు కమిటీలో సభ్యుడైతే అతడే ఆ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తాడు.
- కమిటీలోని మొత్తం సభ్యుల్లో 1/3 వంతును కోరమ్‌గా పరిగణిస్తారు.
పార్లమెంటరీ కమిటీలు-రకాలు
తమకు సహాయపడటానికి కొన్ని ఉప కమిటీలను కూడా పార్లమెంటరీ కమిటీలు నియమించుకోవచ్చు.
భారతదేశంలో రెండు రకాల కమిటీలున్నాయి.
1. స్థాయీ కమిటీలు(Standing Committee)
2. తాత్కాలిక కమిటీలు (Adhoc Committee)
స్థాయీ కమిటీలు
- ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలం గా ఆయా సభలతో ఎన్నుకోబడతాయి. ఇవి నిరంతరంగా పని చేస్తుంటాయి. సభ్యులు మాత్రం మారుతుంటారు. వీటిలో లోక్‌సభ, రాజ్యసభల నిష్పత్తి 2:1లో ఉంటుంది.
తాత్కాలిక కమిటీలు
- అవసరాన్ని బట్టి ఆయా సమయాల్లో ఏర్పడతాయి. వీటిని సభాధ్యక్షులు సభల తీర్మానం ద్వారా ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికను సమర్పించగానే రద్దవుతాయి.
- స్థాయీ కమిటీలు రెండు రకాలు
ఎ. సాధారణ కమిటీలు
(Ordinary Committes)
బి. ఆర్థిక కమిటీలు
(Financial Committees) - ఆర్థికేతర విషయాలను పరిశీలించే కమిటీలను సాధారణ కమిటీలంటారు. ఆర్థిక విషయాలను మాత్రమే పరిశీలించే కమిటీలను ఆర్థిక కమిటీలు అంటారు.
- స్థాయీ కమిటీలను విధుల పరంగా కింది విధంగా వర్గీకరించవచ్చు.
- విచారణ కమిటీలు- విజ్ఞాపన కమిటీ, స్వాధికారాల కమిటీ, ఎథిక్స్ కమిటీ.
- నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలు- ప్రభుత్వ వాగ్దానాలపై కమిటీ, దత్త శాసనాలపై కమిటీ, షెడ్యూల్డ్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ, మహిళా సాధికారిక కమిటీ, లాభదాయక పదవులపై కమిటీ.
- రోజువారీ కార్యక్రమాలు, సభా వ్యవహారాల కమిటీలు- రూల్స్ కమిటీ, సభ్యుల గైర్హాజరు కమిటీ, ప్రైవేట్ మెంబర్స్ బిల్లుపై కమిటీ, సభా వ్యవహారాల సలహా కమిటీ.
- హౌస్ కీపింగ్ కమిటీలు లేదా సేవా కమిటీలు – జనరల్ పర్పస్ కమిటీ, హౌస్ కమిటీ, లైబ్రరీ కమిటీ, సభ్యుల జీతభత్యాలు,
అలవెన్సుల కమిటీ.
ఆర్థిక కమిటీలు ప్రభుత్వ ఖాతాల కమిటీ
- ఇది పార్లమెంటరీ కమిటీల్లో అతి ప్రాచీనమైన కమిటీ. ఈ కమిటీని 1921లో ఏర్పాటు చేశారు. ఇది పార్లమెంటరీ సంయుక్త కమిటీ. ఇందులో మొత్తం 22 మంది సభ్యులుంటారు. 15 మంది లోక్‌సభ నుంచి, ఏడుగురు రాజ్యసభ నుంచి ఆయా సభల సభ్యులచేత నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిలో ఒక సంవత్సర కాలానికి ఎన్నికవుతారు.
- సాధారణంగా రెండు సంవత్సరాల వరకు కొనసాగుతారు. మంత్రులు ఈ కమిటీల్లో ఉండటానికి అర్హులు కారు. ఈ కమిటీ చైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
- అయితే 1967లో ప్రారంభమైన సంప్రదాయం ప్రకారం లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యుడిని చైర్మన్‌గా నియమిస్తున్నారు.
ప్రభుత్వ ఖాతాల కమిటీ-విధులు
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలను ఆధారంగా చేసుకొని కింది అంశాలను పరిశీలిస్తుంది.
- ఖాతాల్లో చూపిన వ్యయం, చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చు పెట్టారా లేదా అని పరిశీలించడం.
- పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉన్నదో లేదో పరిశీలించడం.
- పునర్ వ్యయం నిబంధనల మేరకు అర్హత కలిగిన అధికారుల ఆజ్ఞానుసారంగా జరిగిందో లేదో పరిశీలించడం.
- ప్రభుత్వ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదికలను పరిశీలించడం.
- ఈ కమిటీకి సాంకేతిక, ఇతరత్రా సలహాల ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అందిస్తారు. అందుకే ఇతన్ని ఈ కమిటీకి స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, తత్వవేత్తగా పరిగణిస్తారు.
అంచనాల కమిటీ
- అంచనాల కమిటీని 1950లో ఆనాటి ఆర్థిక మంత్రి జాన్ మథాయ్ సిఫారసు మేరకు పార్లమెంటు ఏర్పాటు చేసింది. ఇందులో 30 మంది సభ్యులుంటారు. సభ్యులందరూ ఒక సంవత్సర కాలానికి లోక్‌సభ నుంచి మాత్రమే ఎన్నికవుతారు.
- మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండొద్దు. ఈ కమిటీ చైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. సంప్రదాయంగా మూడు సంవత్సరాలు కొనసాగుతారు. అంటే 1/3వ వంతు మంది పదవీ విరమణ చేస్తారు.
విధులు
- ప్రభుత్వ అంచనాలను దృష్టిలో పెట్టుకుని పొదుపును పాటించడం, వ్యవస్థలను అభివృద్ధిపరచడం, పాలనా రంగంలో సంస్కరణలను సూచించడం.
- పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
- ఆయా అంచనాల కింద కేటాయించిన నిధులు, దాని పరిధిలో ఉందో లేదో పరిశీలించడం.
- అంచనాలు ఏ రూపంలో పార్లమెంటుకు సమర్పించాలో సూచించడం.
- అంచనాల సంఘం తన నివేదికను లోక్‌సభకు సమర్పిస్తుంది.
గమనిక: ప్రభుత్వ ఖాతాల కమిటీని, అంచనాల కమిటీని ‘కవలల కమిటీ’ అంటారు. కారణం ఈ రెండు కమిటీల విధుల్లో తేడా ఉండకపోవడమే. అలాగే దీన్ని ‘నిరంతర పొదుపు కమిటీ’ అని కూడా అంటారు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

