బౌద్ధమత ఆరాధకుడు.. దక్షిణాది అశోకుడు
శాతవాహనుల సామ్రాజ్యం విచ్ఛిన్నం అనంతరం అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇక్షాకులు శాతవాహనులకు సామంతులు. ఇక్షాకు అంటే చెరకు అని అర్థం. వీరితో పాటు విష్ణుకుండినుల పరిపాలన, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకుందాం.
గ్రూప్స్ ప్రత్యేకం హిస్టరీ
శాతవాహనుల సామ్రాజ్యం విచ్ఛిన్నం అనంతరం అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇక్షాకులు శాతవాహనులకు
సామంతులు. ఇక్షాకు అంటే చెరకు అని అర్థం. వీరితో పాటు విష్ణుకుండినుల పరిపాలన, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకుందాం.
ఇక్షాకులు
- శాతవాహనుల సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత అనేక చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. శాతవాహనులకు సామంతులైన ఇక్షాకులు విజయపురి రాజధానిగా 100 సంవత్సరాలు పరిపాలించారు. ఇక్షాకు అంటే చెరకు అని అర్థం. వీరు రాముని వంశానికి చెందినవారమని ప్రకటించుకున్నారు. ఇక్షాకుల జన్మ స్థలంపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు.
- ఇక్షాకుల రాజ్య స్థాపకుడు వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు. వీరపురుష దత్తుడు గొప్పవాడు. చివరివాడు రుద్ర పురుష దత్తుడు. వీరి రాజ్య చిహ్నం సింహం. రాజభాష ప్రాకృతం ఉండేది. వైష్ణవం, బౌద్ధమతాలను ఆరాధించారు. వీరి కాలంలో బౌద్ధమతం ఉన్నత స్థాయికి చేరింది. జగ్గయ్యపేటలోని మంధాత శిల్పం అతి ముఖ్యమైనది.
- నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనాలు వేయించారు.
రాజకీయ చరిత్ర
- ఇక్షాకులు శ్రీపర్వతీయులుగా, ఆంధ్రభృత్యులుగా, అయోధ్యనేలిన సూర్యవంశీయులుగా, శ్రీరాముని వంశస్థులుగా ప్రసిద్ధి.
వాసిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు (క్రీ.శ. 225-245) - ఇక్షాక వంశ మూల పురుషుడు, రాజ్య స్థాపకుడు. శాతవాహన చివరి పాలకుడు 3వ పులోమావిని ఓడించి రాజ్యం స్థాపించాడు. కార్తికేయుడిని ఆరాధించాడు.
- అశ్వమేధ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయ క్రతువులు నిర్వహించాడు.
- రెంటాల, దాచేపల్లి, కేశానుపల్లి శాసనాలు వేయించాడు.
- శతసహస్ర హాలక, మహాదానాధిపతి, దక్షిణపథ సామ్రాట్ బిరుదులున్నాయి. ఇతను వ్యవసాయాభివృద్ధికి బంగారు నాణేలు, గోవులు, నాగళ్లను దానం చేశాడు. ఇతడి కుమార్తె అడవి శాంతిశ్రీ నాగార్జున కొండలోని బౌద్ధ ఆరామవిరామాన్ని నిర్మించారు.
వీర పురుష దత్తుడు (క్రీ.శ. 245-265)
- ఇతడి కాలాన్ని బౌద్ధమత స్వర్ణయుగంగా పేర్కొంటారు. దక్షిణాది అశోకుడు అనే బిరుదు కలవాడు.
- అల్లూరి శాసనం, నాగార్జున కొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పుగుండూరు శాసనం, జగ్గయ్యపేట శాసనాలు వేయించాడు.
- శైవ మతాన్ని ద్వేషిస్తున్నట్లు, శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్లు శిల్పాలు నాగార్జున కొండలో ఉన్నాయి. బౌద్ధమతాన్ని ఆరాధించాడు.
- ఇక్షాక రాజుల్లో బౌద్ధమతం స్వీకరించిన ఏకైక రాజు వీరపురుష దత్తుడు. మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఇతని కాలంలోనే ప్రారంభమైంది. శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది. (భారతదేశంలో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం). ఇతని అధికారి ఎలిసిరి పేరు మీద ఏలేశ్వరం ఆలయం నిర్మించాడు.
- ఉపాసిక బోధిసిరి అమరావతిలో రాజబాంఢాగారికుడైన బోధిశర్మ మేనకోడలు. ఈమె బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసింది.
- ప్రముఖ మాధ్యమిక వాద బౌద్ధ పండితుడు, స్వతంత్రవాద స్థాపకుడు అయిన భావ వివేకుడు విజయపురిలో నివసించినట్లు హుయాన్త్సాంగ్ రచనల ద్వారా తెలుస్తుంది.
- చులదమ్మగిరి కొండపై బౌద్ధ విహారం, చైత్యం నిర్మించింది. పుష్పగిరి శిలామండపం నిర్మించింది. ఆనందుడు శ్రీపర్వత విహారానికి మరమ్మతులు చేశాడు.
వాసిష్టీపుత్ర ఎహువల శాంతమూలుడు (క్రీ.శ.265-290)
- బౌద్ధ చైత్యాలకు మండపాలు నిర్మించాడు. ఇతని సోదరి కొడబలిసిరి నాగార్జునకొండలో బౌద్ధ విహారం నిర్మించింది.
- దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటి రాజు.
- పుష్పభద్ర, నారాయణ స్వామి, కార్తికేయుని, నవగ్రహ, నందికేశ్వర, హారితి ఆలయాలు నిర్మించాడు.
- ఇతని సేనాపతి ఎలిసిరి నాగార్జున కొండ వద్ద కుమారస్వామి ఆలయం నిర్మించాడు. అభిర రాజు శకసేనుని సేనాని శివసేనుడు నాగార్జున కొండ వద్ద అష్టభుజ నారాయణ స్వామి ఆలయం కట్టించాడు.
- నాగార్జున కొండ శాసనం (సంస్కృత శాసనం), గుమ్మడి దుర్రు (ప్రాకృత శాసనం/స్తూప శాసనం) శాసనాలు వేయించాడు.
రుద్ర పురుష దత్తుడు (క్రీ.శ. 290-300)
- రుద్ర పురుష దత్తుడు పల్లవ రాజు సింహవర్మచే వధించబడినట్లు మంచికల్లు శాసనం తెలుపుతుంది. ఇక్షాకుల అంతం గురించి మైదవోలు శాసనం తెలియజేస్తుంది. పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని రాష్ర్టాలుగా ఆహారాలుగా, పదాలుగా విభజించారు.
- రాష్ట్ర పాలకులుగా మహా తలవరులు, మహా సేనాపతులు, మహా దండ నాయకులను నియమించారు. ప్రధాన న్యాయమూర్తిని ‘మహాతలవరి’ అన్నారు.
ఆర్థిక వ్యవస్థ
- రోమన్ల బంగారు నాణేలు నాగార్జున కొండ, జగ్గయ్యపేటలో కనుగొన్నారు. ఈ కాలంలో వర్తక శ్రేణులు పూసిన శ్రేణి (మిఠాయి వ్యాపారుల సంఘం)గా ప్రసిద్ధి. పర్హిక శ్రేణిని తమలపాకుల వ్యాపార సంఘం అనేవారు. వృత్తి పన్నులు విధించినట్లు ‘విషవట్టి శాసనం’ తెలుపుతుంది.
సామాజిక వ్యవస్థ
- ఇక్షాకులు తమ తల్లి పేరు తమ పేర్లతో కలిపి ఉపయోగించారు. మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే ఆచారం ఉంది.
సాంస్కృతిక వ్యవస్థ
- భారతదేశంలో సంస్కృతాన్ని పునరుద్ధరించిన మొదటివారు ఇక్షాకులు. శాసనాల్లో మొదటిసారిగా శాసనం వేయబడ్డ సంవత్సరం, మాసం, తేదీలను ప్రస్తావించే సంప్రదాయం ఇక్షాకుల కాలం నుంచి మొదలైంది.
మత పరిస్థితులు
- రాజులు బ్రాహ్మణ మతం, రాణులు బౌద్ధమతాన్ని ఆధరించారు.
విష్ణుకుండినులు
- వీరి రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ. (మహారాజేంద్రవర్మ). వీరిలో 2వ మాధవవర్మ గొప్పవాడు. చివరివాడు మంచన భట్టారకుడు.
- వి.వి. కృష్ణశాస్త్రి ప్రకారం కీసర రాజధానిగా, పి.వి. పరబ్రహ్మశాస్త్రి ప్రకారం ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరి రాజ చిహ్నం పంజా ఎత్తిన సింహం. రాజ భాషగా సంస్కృతం ఉండేది. వైష్ణవ మతాన్ని ఆరాధించేవారు.
ఉండవల్లి గుహలు వీరి శిల్పకళా నైపుణ్యాన్ని తెలుపుతాయి. - ‘ఘటికలు’ అనే హిందూ విద్యా సంస్థలు ప్రారంభించిన తొలి రాజవంశం వీరిదే. నరబలిని ప్రోత్సహించారు. కీసర గుట్టలోని రామలింగేశ్వరాలయాన్ని నిర్మించారు.
జీబీకే పబ్లికేషన్స్ సౌజన్యంతో…
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

