గ్రూప్ 2, 3,4, డీఎస్సీ, గురుకులాల ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
గ్రూప్- 2,3,4 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీలో ఫస్ట్‌క్లాస్‌లో, డీఎస్సీ, గురుకులాలకు దరఖాస్తు చేసుకునేందుకు 60శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 5లక్షల లోపు ఉండాలని సూచించారు. దరఖాస్తులను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలోగల టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు 040-24071178, 040-27077929లో సంప్రదించాలన్నారు.