ఉచిత సివిల్స్ కోచింగ్ కోసం స్క్రీనింగ్ టెస్ట్.. 11న పరీక్షకు అందుబాటులో హాల్ టికెట్లు!
Free Civils Coaching | తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ -2022 కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 11న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్

Free Civils Coaching | తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ -2022 కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 11న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి వెల్లడించారు. బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ http://tsbcstudycircle.cgg.gov.in లో 3064 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారందరి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 11 న రెండు విడతలుగా జరగనుందని తెలియజేశారు. ఉదయం 9 నుంచి 11 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం12 నుంచి 2 వరకు రెండో షిఫ్ట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. రెండు గంటల పరీక్ష వ్యవధిలో మొత్తం వంద ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు.
మొత్తం రెండు వందల మార్కుల ప్రశ్నాపత్రం ఇంగ్లీష్‌లో ఉంటుందన్నారు. నెగిటివ్ మార్క్ ఉందన్న విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, మాస్క్ లేనివారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా సివిల్స్ కోచింగ్, మెటీరియల్ అందిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

