వచ్చేనెల 1 నుంచి ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్
TS EAMCET | బీఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ మేరకు ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్

హైదరాబాద్: బీఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ మేరకు ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను టీఎస్ ఎంసెట్ విడుదల చేసింది. డిసెంబర్ 1 నుంచి 3 వరకు స్లాట్‌బుక్ చేసుకోవాలని, 3, 4 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలని, డిసెంబర్ 7న బీఫార్మసీ, ఫార్మ్ డీ తొలి విడత సీట్లను కేటాయిస్తామని అధికారులు చెప్పారు. 7 నుంచి 10 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలన్నారు.
డిసెంబర్ 13 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. 13న స్లాట్ బుకింగ్, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. డిసెంబర్ 17న తుది సీట్లను కేటాయిస్తామని చెప్పారు. సీట్లు పొందినవారు 17 నుంచి 19 వరకు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలన్నారు. డిసెంబర్ 18 నుంచి 20 మధ్య విద్యార్థులు తమకు కేటాయించి కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. డిసెంబర్ 19న స్పాట్ అడ్మిమిషన్ ఉంటుందని వెల్లడించారు. పూర్తివివరాలకు https://tseamcetb.nic.in/లో సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

