న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ కోల్డ్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 139 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 139
ఇందులో జనరల్ 99, ఎస్సీ 33, ఎస్టీ 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రాతపరీక్షకు 70 మార్కులు, ప్రొఫిషియెన్సీ టెస్ట్‌కు 30 మార్కులు కేటాయించారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, డిసెంబర్ 6
వెబ్సైట్: www.centralcoalfields.in