అంబేద్కర్ వర్సిటీలో కొత్త కోర్సులు..
BRAOU | ప్రతిష్ఠాత్మక బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU)లో కొత్తగా రెండు కోర్సులు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. 2023–24 విద్యాసంవత్సరంలో జాగ్రఫీ, ఇంటర్నేషనల్ స్టడీస్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. బీఏ కోర్సులో భాగంగా వీటిని అందుబాటులోకి తెస్తారు.
హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU)లో కొత్తగా రెండు కోర్సులు ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. 2023–24 విద్యాసంవత్సరంలో జాగ్రఫీ, ఇంటర్నేషనల్ స్టడీస్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. బీఏ కోర్సులో భాగంగా వీటిని అందుబాటులోకి తెస్తారు. సివిల్స్ సహా గ్రూప్-1 ఉద్యోగాలకు జాగ్రఫీ సబ్జెక్టు నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారిని దృష్టిలో పెట్టుకొని జాగ్రఫీ సబ్జెక్టును అందుబాటులోకి తీసుకురానున్నారు. వర్తమాన అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నేషనల్ స్టడీస్‌ను సైతం ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఆన్లైన్ కోర్సులు
చాలా కాలం నుంచి సంప్రదాయ కోర్సులను నిర్వహిస్తున్న బీఆర్‌ఏవోయూ.. తాజాగా ఆన్లైన్ కోర్సులను సైతం అమలు చేస్తున్నది. ఇప్పటికే స్ర్టెస్ మేనేజ్మెంట్, జనరల్ స్టడీస్ కోర్సులను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చి టెలీ పాఠాలను ప్రసారం చేస్తున్నది. వీటిని యూట్యూబ్ చానల్, మొబైల్ యాప్‌లలోనూ అందుబాటులోకి తేవాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. స్వయం పోర్టల్ ద్వారా ఆన్లైన్ కోర్సులను అభ్యసించే అవకాశం ఉన్నది. బీఆర్ఏవోయూలో ప్రవేశపెట్టే కొత్త కోర్సులను సైతం స్వయం పోర్టల్‌తో అనుసంధానిస్తారు. ఆయా కోర్సులకు క్రెడిట్స్‌ను జారీచేసి, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ)తో అనుసంధానించనున్నట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

