థీసిస్ అవసరంలేని పీహెచ్డీ.. భారతీయుడికి లభించిన ఓస్కార్ క్లెయిన్ మెడల్
ఓస్కార్ క్లెయిన్ మెడల్ తొలిసారి భారతీయ భౌతికి శాస్త్రవేత్తకు లభించింది. థీసిస్ అవసరం లేకుండా పీహెచ్‌డీని ఓ యూనివర్సిటీ ప్రవేశ పెట్టింది. ఈ వారం కరెంట్ మీటర్‌లోని ప్రశ్నలు, సమాధానాలు తెలుసుకుందాం.
కరెంట్ మీటర్
1) ఎల్‌నినో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నిటిని కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
2) అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ప్రస్తుత చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ప్రభుత్వం.. ఆ స్థానంలో ఎవరిని నియమించింది?
3) దేశంలో 100 శాతం సేంద్రియ కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ప్రాంతం?
4) దేశంలోనే మొదటిసారిగా థీసిస్ అవసరంలేని పీహెచ్డీ డిగ్రీని ప్రవేశపెట్టిన విశ్వవిద్యాలయమేది?
5) కార్యకలాపాల నిర్వహణలో అత్యుత్తుమ ప్రమాణాలు, క్రమ పద్ధతిలో రికార్డులను భద్రపరచడం, బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తిస్తున్నందుకుగాను దేశంలోనే తొలిసారిగా ఒక విపత్తు ప్రతిస్పందన దళానికి ఐఎస్వో ధ్రువ పత్రాన్ని అందించారు. ఆ సర్టిఫికెట్ పొందిన రాష్ట్రమేది?
6) ఆధునిక స్ట్రింగ్ థియరీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారతీయ భౌతిక శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక ‘ఓస్కార్ క్లెయిన్ మెడల్’ లభించింది. ఈ అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్న ఆ తొలి భారతీయుడి పేరేమిటి?
7) దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం అధికార మార్పిడికి చిహ్నంగా నాటి ప్రధాని నెహ్రూకు బ్రిటిష్ వారు బంగారు పూత పూసిన సెంగోల్‌ను అందించారు. ఆ సెంగోల్ రూప శిల్పుల్లో ఒకరు ఇటీవల వృద్ధాప్యంతో మరణించారు. ఆయన పేరేమిటి?
8) ఇటీవల జపాన్‌లో నిర్వహించిన పారా ఆసియా క్రీడల్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?
9) ఇటీవల జరిగిన బ్రెజిల్ ఎన్నికల్లో నాలుగోసారి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు?
10) తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైన వ్యక్తి పేరేమిటి?
జవాబులు
1. 365
2. సునీల్ కుమార్
3. లద్దాఖ్
4. ఐఐటీ రోపర్ (పంజాబ్)
5. ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం
6. ప్రొఫెసర్ అశోక్ సేన్
7. వుమ్మిడి ఎతిరాజ్
8. 114 పతకాలు (30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్యాలు)
9. లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా
10. జస్టిస్ తపబ్రత చక్రవర్తి

Vummidi Ethiraj

Prof Ashoke Sen

Udrf
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

