న్యూఢిల్లీ: కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 86 డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నది. డిగ్రీ పూర్తయినవారు అప్లయ్ చేయడానికి అర్హులని పేర్కొన్నది. స్కిల్‌టెస్ట్, రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం ఖాళీలు: 86
అర్హతలు: డిగ్రీ పూర్తి ఇంగ్లిష్, హిందీలో టైపింగ్ చేయగలగాలి. ఎమ్మెస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ తెలిసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: స్కిల్‌టెస్ట్, ఆన్లైన్ రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ అభ్యర్థులకు రూ.450
దరఖాస్తులకు చివరితేదీ: మే 22
వెబ్సైట్: www.becil.com