న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్‌లు
ట్రేడ్ అప్రెంటిస్| కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లో ట్రేడ్ అప్రెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులు వచ్చేనెల 15 లోపు పంపిచాలని సూచించింది.

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లో ట్రేడ్ అప్రెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులు వచ్చేనెల 15 లోపు పంపిచాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లోని 121 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైనవారు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 121
ఇందులో ఎలక్ట్రిషన్ 32, ఫిట్టర్ 32, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 12, ఎలక్ట్రానిక్ మెకానిక్ 12, పాసా, వెల్డర్, టర్నర్ 7 చొప్పున, మెషినిస్ట్ 6, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. 14 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Nuclear Power Corporation of India Limited, Anumala-394651, Ta. Vyara, Dist. Tapi, Gujarat
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://www.npcil.nic.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

