ఫిల్మ్, టీవీ కోర్సుల్లో ప్రవేశాలు
24 ఫ్రేమ్స్.. టీవీ, సినిమా పరిశ్రమ ప్రపంచంలో అతిపెద్ద రంగాల్లో ఒకటి. కోట్లాదిమందికి ఉపాధిని అందిస్తుంది. దీనిలో హీరో, హీరోయిన్లే కాకుండా 24 ఫ్రేమ్స్ తయారుకావడానికి వందలాదిమంది నిపుణుల శ్రమ అవసరం. సినిమారంగంలో ప్రొడక్షన్, యానిమేషన్, స్క్రీనింగ్, రైటింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ఆయా అంశాలపై సుశిక్షితులైన వారు కావాలి. సినిమాకు ప్రాణాధారమైన ఆయా రంగ నిపుణులను అందిస్తూ దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లుగా పేరుగాంచిన పుణె, కోల్‌కతాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
జెట్
కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్ఎఫ్టీఐ), పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ)లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ టెస్ట్ (జెట్).
ప్రవేశాలు కల్పించే కోర్సులు
మూడేండ్ల కోర్సులు: ప్రొడ్యూసింగ్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, యానిమేషన్ సినిమా, ఆర్ట్ డైరెక్షన్ & ప్రొడక్షన్ డిజైన్, డైరెక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే రైటింగ్.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజైన్
రెండేండ్ల కోర్సులు: స్క్రీన్ యాక్టింగ్, స్క్రీన్
రైటింగ్, డైరెక్షన్ & ప్రొడ్యూసింగ్, సినిమాటోగ్రఫీ, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా మేనేజ్మెంట్, రైటింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా.
ఏడాది కోర్సులు: డైరెక్షన్, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ టెలివిజన్ ఇంజినీరింగ్.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ కోర్సుకు డిగ్రీలో అప్లయిడ్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ లేదా పెయింటింగ్, స్కల్ప్చర్, ఇంటీరియర్ డిజైన్ లేదా సంబంధిత ఫీల్డ్‌కు సంబంధించిన ఫైన్స్ ఆర్ట్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: జెట్-2021లో వచ్చిన మార్కులతోపాటు ఆయా కోర్సులకు కావల్సిన కొన్ని పరీక్షలు నిర్వహించి షార్ట్‌లిస్ట్ చేసి తుది ఎంపిక చేస్తారు.
జెట్-2021: దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. 3 గంటల కాలవ్యవధి.
ప్లేస్‌మెంట్స్: రెండు సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఆయా రాష్ర్టాల్లోని సిని మా, మీడియా పరిశ్రమలతోపాటు అంతర్జాతీయంగా కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ చదివిన విద్యార్థులు పలువురు జాతీయస్థాయి ఫిల్మ్ అవార్డులతోపాటు ఆస్కార్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ అవార్డులను అందుకున్నారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 2
పరీక్షతేదీ: డిసెంబర్ 18, 19
వెబ్సైట్: https://ftii.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ