నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఒకేసారి ఇంటికి.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం

జల్పాయ్గురి (పశ్చిమబెంగాల్): అతడు జల్సా జీవితానికి అలవాటుపడ్డాడు. ఒకే సమయంలో నలుగురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపాడు. తమకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న ఆ నలుగురు యువతులూ ఒకేసారి ఇంటికొచ్చి నిలదీసేసరికి.. సమాధానం చెప్పలేక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ కూచ్‌బెహర్ జిల్లా మత్తభంగ పట్టణ సమీపంలోని జోర్‌పట్కి అనే గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది.
ఆ వ్యక్తి పేరు సుభమోయ్ కర్. ఒక మెడికల్ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ పేరుతో చేసిన ఘనకార్యం గురించి తెలుసుకున్న ఆ నలుగురు అమ్మాయిలు కలిసి సుభమోయ్ ఇంటికి వచ్చారు. తమకు చేసిన మోసంపై వాగ్వివాదానికి దిగారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక సుభమోయ్ గదిలోకి వెళ్లి విషం తాగాడు. ప్రస్తుతం అతను జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదమేమీ లేదని, పరిశీలనలో ఉంచామని వైద్యులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dulqer Salmaan | ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్!
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Jharkhand | జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

