MI vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఈరోజు ఆసక్తికర మ్యాచ్. ఫైనల్ బెర్తు కోసం జరుగుతున్న పోరులో యూపీ వారియర్స్(UP Warriorz), ముంబై ఇండియన్స్(Mumbai Indians) తలపడున్నాయి. టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ అలిసా హీలీ ఫీల్డింగ్ తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూపీపై ఐదు వికెట్ల తేడాతో నెగ్గి నేరుగా ఫైనల్ చేరింది. దాంతో, నెట్ రన్‌రేటులో వెనకబడిన ముంబై ఫైనల్ బెర్తు కోసం వేచి చూడాల్సి వచ్చింది.
ముంబై ఇండియన్స్ జట్టు : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), పూజా వస్త్రాకర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సైకా ఇషాక్.
యూపీ వారియర్స్ జట్టు : అలిసా హేలీ (కెప్టెన్), శ్వేతా షెరావత్, కిరణ్ నవగిరే, గ్రేస్ హ్యారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, సిమ్రాన్ షేక్, పర్షవీ చోప్రా, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్.
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఢిల్లీతో 26న టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. బలమైన ముంబైని రెండో రౌండ్లో ఓడించిన యూపీ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనుకుంటోంది. బలమైన ముంబై జట్టును చిత్తు చేస్తుందా? లేదా ఓటమితో నిష్క్రమిస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.