సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్

ఒట్టావా: ఒక సరస్సులో పడిన ఐఫోన్ 11 ఆరు నెలల తర్వాత కూడా పని చేస్తున్నది. దానిపై ఆశ వదులుకున్న యజమాని చెంతకు చేరి విస్మయానికి గురి చేసింది. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఈ ఘటన జరిగింది. వాంకోవర్‌కు చెందిన ఫాతిమా ఘోడ్సీ గత ఏడాది సెప్టెంబర్‌లో బ్రిటీష్ కొలంబియాలోని హారిసన్ సరస్సులో బోటుపై ప్రయాణిస్తుండగా ఐఫోన్11 పొరపాటున ఆమె చేతిలోంచి జారి నీటిలో పడిపోయింది. సరస్సు అడుగుకి వెళ్లిన ఆ ఫోన్‌పై ఆమె ఆశలు వదులుకున్నారు.
కాగా, చిల్లివాక్కు చెందిన ఒక జంట, హారిసన్ సరస్సులో లోపల పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంటారు. ఇటీవల వారికి కొన్ని వ్యర్థాలతోపాటు రెండు మొబైల్ ఫోన్లు సరస్సులోని నీటి అడుగున కనిపించాయి. వాటిలో ఒకటి సాధారణ మొబైల్ ఫోన్ కాగా మరొకటి ఖరీదైన ఐఫోన్11. వారు ఆ మొబైల్స్‌ను ఇంటికి తీసుకెళ్లి పరిశీలించారు. అందులో ఒక మొబైల్ ఫోన్ పని చేయకపోగా ఐఫోన్11 మాత్రం తిరిగి పనిచేయడం ప్రారంభించింది.
దీంతో ఆ దంపతులు ఆ మొబైల్ ఓనర్ ఫాతిమాను సంప్రదించారు. ఇటీవల ఆమె వారి ఇంటికి వచ్చి తాను పోగొట్టుకున్న ఐఫోన్11ను తిరిగి పొందారు. అయితే ఆ మొబైల్ ఆరు నెలలుగా నీటిలో ఉన్నప్పటికీ ఏమాత్రం పాడవ్వక చక్కగా పనిచేస్తుండటంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఇటీవల తనకు పాత ఫోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని, తన స్నేహితులు ఆటపట్టిస్తున్నట్లు భావించానని చెప్పారు. అయితే తాను సరస్సులో పోగొట్టుకున్న ఐఫోన్ 11 తనకు తిరిగి దక్కడాన్ని నమ్మలేకపోయినట్లు తెలిపారు. ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు.
కాగా, ఆపిల్ సంస్థకు చెందిన లేటెస్ట్ ఐఫోన్లు అనేక ఇతర ఖరీదైన పరికరాల మాదిరిగా ఐపీ (ఇంగ్రెస్ ప్రొటెక్షన్) రేటింగ్ కలిగి ఉన్నాయి. ఈ పరికరం నీటిలో కూడా సురక్షితంగా ఉంటుందని ఇది ధృవీకరిస్తుంది. ఐఫోన్ 11కి ఐపీ 68 రేటింగ్ ఉన్నది. అంటే ఇది గరిష్ఠంగా రెండు మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు పనిచేస్తుంది. అయితే సరస్సులో ఫాతిమా పోగొట్టుకున్న ఐఫోన్ 11 ఆరు నెలలుగా నీటిలో ఉన్నప్పటికీ చక్కగా పనిచేస్తుండటం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

