కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బింబిసార’.‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కేథరీన్ థ్రెసా, సంయుక్తా మీనన్ నాయికలు. ఈ సినిమాను ఆగస్టు 5న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ఠ్ మాట్లాడుతూ…‘కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హై బడ్జెట్ మూవీ ఇది. టైమ్ ట్రావెల్ కథా నేపథ్యంతో తెరకెక్కించాం. సినిమాలో విజువల్ ఎఫెక్ట్లు, కీలకంగా ఉంటాయి. భారీ సెట్స్‌లో చిత్రీకరణ జరిపాం. సినిమా సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : చిరంతన్ భట్, ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రఫీ : ఛోటా కె నాయుడు, ఎడిటర్ : తమ్మిరాజు, ఆర్ట్ : కిరణ్ కుమార్.