శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకుడు. కె.ఎస్.శంకర్రావు, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌ను దర్శకుడు హరీష్‌శంకర్ విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మధురపూడి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ పల్లెటూరిలో ఓ హత్య జరుగుతుంది? అది ఎవరు చేశారు? అందుకు కారణాలేమిటన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. క్రైమ్, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: సురేష్ భార్గవ్.