చలికాలంలో దురద, చర్మం పొడిబారడం, మొటిమలు మొదలైన సమస్యలు కామన్. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయినప్పుడు చర్మ కణాల్లోని తేమశాతం తగ్గడంతో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే, చాలామంది ఈ సమస్యకు పరిష్కారంగా మార్కెట్లో దొరికే మాయిశ్చరైజర్లు, క్రీములు, లోషన్లు వాడుతుంటారు. ఇవి తాత్కాలికంగా దురద సమస్య నుంచి ఉపశమనం కల్పించినా..ఇందులోని కెమికల్స్ వల్ల చర్మంపై సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే చర్మాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు డెర్మటాలజిస్ట్లు. మరి ఆ చిట్కాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..