మా ఆదేశాలనే పట్టించుకోరా.. జహంగిర్‌పురి ఘటనపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్‌పురిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేత ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. షాపులు, ఇండ్ల కూల్చివేతను నిలిపివేయాలని తాము ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా ఎలా బుల్డోజర్లకు పని పెట్టారని ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రశ్నించింది. ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణించనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఇవాళ కేసును విచారించింది. ఎన్డీఎంసీ మేయర్‌కు కూల్చివేత ఆపేయాలని ఆదేశాలు పంపినా, ఎలా నిర్మాణాల కూల్చివేత కొనసాగించారని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం పేర్కొన్నది.
కూల్చివేతకు ముందు నార్త్ ఢిల్లీ మున్సిపాలిటీ ఏదైనా నోటిసు ఇచ్చిందా లేదా అన్న అంశాన్ని సమర్పించాలని కోర్టు కోరింది. అయితే ఈ కేసును మళ్లీ రెండు వారాల తర్వాత విచారించనున్నట్లు చెప్పిన ధర్మాసనం.. ప్రస్తుతం నిర్మాణాల కూల్చివేతపై స్టే కొనసాగించాలని ఆదేశించింది. కూల్చివేత డ్రైవ్‌తో ఓ వర్గాన్ని టార్గెట్ చేశారని సీనియర్ అడ్వకేట్ దుశ్యంత్ దావే ఆరోపించారు. హనుమాన్ జయంతి రోజున రెండు వర్గాల మధ్య జహంగిర్‌పురిలో ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అకస్మాత్తుగా అధికారులు ఆ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రారంభించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

