ములుగు : ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 76.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. స్థానికంగా కురిసిన వర్షాలతో పాటు ఎగువన కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నది. భారీ వర్షాల నేపపథ్యలో ప్రజలు అప్రమత్తంగా ఉండాని అధికారులు సూచించారు.