బొటాక్స్‌తో మటుమాయం
మనం తినే ఆహారం, నివసించే పరిసరాలు, వాడే ఔషధాలు, మన మానసిక పరిస్థితి.. చెమటలు పట్టడానికి అనేక కారణాలు. చిట్కాలతో హైపర్హైడ్రోసిస్ సమస్య పరిష్కారం కానప్పుడు.. బొటాక్స్ ఇంజెక్షన్‌తో ఉపశమనం పొందవచ్చు.
నాకు చెమటలు విపరీతంగా పడుతాయి. ఈ సమస్యకు ఏదైనా చికిత్స ఉందా?
- ఓ పాఠకురాలు
మనం తినే ఆహారం, నివసించే పరిసరాలు, వాడే ఔషధాలు, మన మానసిక పరిస్థితి.. చెమటలు పట్టడానికి అనేక కారణాలు. చిట్కాలతో హైపర్హైడ్రోసిస్ సమస్య పరిష్కారం కానప్పుడు.. బొటాక్స్ ఇంజెక్షన్‌తో ఉపశమనం పొందవచ్చు. బొటోలినమ్ టాక్సిన్ ఇంజెక్షన్లకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా ఉంది. చెమటలకు కారణమైన రసాయనాలను ఇవి నిరోధిస్తాయి. ఫలితంగా ఎనభై నుంచి తొంభైశాతం మేర సమస్య పరిష్కారం అవుతుంది.
రెండు నుంచి నాలుగు రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. ఆయా వ్యక్తుల శరీర స్వభావాలను బట్టి ఆ ప్రభావం నాలుగు నుంచి పన్నెండు నెలల వరకు ఉంటుంది. కొందరికి అరచేతులు, అరికాళ్లు, ఛాతీ, నుదురు తదితర భాగాల్లో ధారాపాతంగా చెమటలు కారుతుంటాయి. అలాంటి సందర్భాల్లోనూ బొటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వవచ్చు. ఇది పది నిమిషాల ప్రక్రియ. దీర్ఘకాలికంగా చెమట సమస్య వేధిస్తున్నప్పుడు.. మనసులోనే కుమిలిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని దూరం చేసుకోకుండా సౌందర్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
– డాక్టర్ అనున్యా రెడ్డి
ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
ఇ.ఎన్.టి సర్జన్
ఎలర్జీ స్పెషలిస్ట్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

