సిడ్నీ: ఆకాశం నుంచి ఏలియన్ ఊడి పడిందా? ఇప్పుడు ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్న ఇది. ఇటీవల ఆ దేశంలో కురిసిన భారీ వర్షాల తర్వాత ఓ వ్యక్తి ఉదయం నడకకు వెళ్లాడు. అతడికి ఓ వింత జీవి కనిపించింది. కట్టెపుల్లతో దాన్ని కదిలించినా అది కదలలేదు. వెంటనే అతడు దాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీన్ని చూసినవారంతా ఏమిటి ఈ జీవి? ఏలియనా? అని తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. చివరికి శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. దీంతో వీళ్లు కూడా తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఈ జీవి గురించి చెప్పగలరా? అని నెటిజన్లను కోరారు.