వారియర్ పోలీస్
హీరో రామ్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. సంఘవిద్రోహుల పాలిట సింహస్వప్నమైన ఈ డైనమిక్ పోలీస్ విధి నిర్వహణలో ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఏమిటో వెండితెరమీదే చూడాలంటున్నారు చిత్ర దర్శకుడు లింగుస్వామి. ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘రామ్ పోలీసు అధికారిగా సరికొత్త పంథాలో కనిపిస్తారు. నాయకప్రతినాయకుడి మధ్య పోరు హోరాహోరిగా అనిపిస్తుంది. బలమైన ఎమోషన్స్తో సాగే మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు. ప్రస్తుతం మేడ్చల్ రైల్వేస్టేషన్లో ఇంటర్వెల్ యాక్షన్ ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా-లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, యాక్షన్: విజయ్ మాస్టర్, అన్బు-అరివు, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

