సిడ్నీ: ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో ఉన్న టోంగా అనే ద్వీపానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఓ భారీ అగ్ని పర్వతం పేలింది. వెయ్యేండ్లకు ఓసారే ఇలాంటి పేలుడు సంభవిస్తుందట. పేలుడుతో వెలువడిన బూడిద దాదాపు మూడు మైళ్ల విస్తీర్ణంలో, 12 అడుగుల ఎత్తుతో ఎగసిపడి టోంగా ద్వీపం మొత్తాన్ని కప్పేసింది. ఈ పేలుడు అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. టోంగా రాజధాని నుకుఅలోఫా బూడిదమయమైంది. 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అమెరికా తీర ప్రాంతాల్లో అలలు ఏకంగా నాలుగన్నర అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి. అలల తీవ్రతకు దక్షిణ అమెరికాలోని పెరూలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సముద్రం భూగర్భంలో అగ్నిపర్వతం పేలుడుతో పలు దేశాల్లో సునామీ వచ్చే ప్రమాదమున్నదని వాతావరణ నిపుణులు తీరప్రాంత దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.