TTD : 20న తిరుచానూరు పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
TTD : 20న తిరుచానూరు పద్మావతి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20న వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్రతాన్ని ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. వర్చువల్ విధానంలో

తిరుమల : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 20న వరలక్ష్మీ వ్రతం జరుగనుంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వ్రతాన్ని ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఈ టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. 20న ఉదయం అమ్మవారి మూలవరులకు, ఉత్సవరులకు ఏకాంతంగా అభిషేకం చేయనున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీకృష్ణ ముఖ మండపంలో వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు.
ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, డజను గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా భక్తుల చిరునామాకు పంపడం జరుగుతుందని అధికారులు తెలిపారు. పోస్టల్ చార్జీతో కలిపి ఈ సేవా టికెట్ ధరను రూ.1001గా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా వర్చువల్ టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

