అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో కీలక ఆటగాడైన రవికుమార్.. టీమిండియా సీనియర్ పురుషుల జట్టు మాజీ సారధి కోహ్లీ గురించి ఆసక్తికర అంశం వెల్లడిండాడు. అండర్19 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుతంగా రాణించిన రవి.. టీమిండియా ఈ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ క్రమంలో మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీకి, తనకు మధ్య జరిగిన సంభాషణను రవి వెల్లడించాడు. ఫైనల్ ముందు టీమిండియాలో స్ఫూర్తినింపేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. దీనికోసం జట్టు సభ్యులకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అనంతరం ఫైనల్ మ్యాచ్ ఆడిన యువ భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీకి, తనకు మధ్య జరిగిన సంబాషణను రవి బయట పెట్టాడు. బ్యాటింగ్లో కోహ్లీ బలహీనత ఏంటని రవి అడిగాడట. దీనికి బదులిచ్చి కోహ్లీ.. ’ఎందుకు? ఇప్పటి నుంచే నన్ను అవుట్ చేయడానికి ప్లాన్లు వేస్తున్నావా?‘ అని అడిగినట్లు రవి తెలిపాడు. ఇలా కోహ్లీ చాలా సరదాగా మాట్లాడినట్లు చెప్పాడు.