kadthal pyramid : పదవులు ఎవరికి శాశ్వతం కాదు.. సమాజ సేవ చేయడమే గొప్ప పదవి
- హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- ధ్యాన మహాసభల్లో పాల్గొన్న గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే
- పత్రీజీతో కలిసి కింగ్ ఛాంబర్లో ధ్యానం చేసిన గవర్నర్

కడ్తాల్ : మనస్సును నియంత్రించుకుంటే అంతా మంచే జరుగుతుందని, ధ్యానాన్ని మించిన సంపదలేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మండల కేంద్రం సమీపంలోని కైలాసాపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో జరుగుతున్న మహిళ ధ్యాన మహా సభలు-3 ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ధ్యాన మహాసభల్లో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఆయనకి నాగర్‌కర్నూల్ ఎంపి పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ధ్యాన గురువు సుభాశ్ పత్రీజీ, ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పుష్పాగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహేశ్వర మహా పిరమిడ్‌ను ఎంపీ, ఎమ్మెల్యేతో కలిసి గవర్నర్ సందర్శించారు. పిరమిడ్‌లోని కింగ్ ఛాంబర్లో సుభాశ్ పత్రీజీతో కలిసి గవర్నర్ కాసేపు ధ్యానం చేశారు. అనంతరం ధ్యాన మహా సభల్లో గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడారు. భారతదేశంలో మహిళ శక్తి చాలా గొప్పదని, మహిళలు ఉన్న స్థలంలో శుభం, క్షేమం, శాంతి కలిగి ఉంటాయని తెలిపారు. మహిళలు భాగుంటేనే ఇల్లుతో పాటు దేశం బాగుంటుందన్నారు. పదవులు ఎవరికి శాశ్వతం కావని, సమాజ సేవ చేయడమే గొప్ప పదవి అని పేర్కొన్నారు. సేవ చేయడానికి గొప్ప హృదయం అవసరమని, మనం చేసే మంచి పనులే సమాజంలో గుర్తింపునిస్తాయన్నారు. మనిషి మనస్సు చంచలమైనదని, మనస్సును నియంత్రించున్న వారు సమాజంలో గొప్పగా కీర్తింపబడతారని తెలిపారు. ఆధ్యాత్మికతో కరోనాలాంటి మహమ్మారిని జయించవచ్చన్నారు.

సామాన్య ప్రజల్లో అధ్యాత్మిక చైతన్యం వస్తే, భారతదేశం విశ్వ గురువు అవుతుందన్నారు. ఎంతోమంది గురువులు, మునులు, మహానుభావులు దేశానికి ఆధ్యాత్మికత అనే గొప్ప సంపదని ఇచ్చారని పేర్కొన్నారు. ధ్యానానికి మించిన సంపదలేదని, నిత్యం ధ్యానం మానసిక ప్రశాంతాత లభిస్తుందన్నారు. హిమచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న సమయంలో ధ్యాన సాధన నేర్చుకున్నానని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. పిరమిడ్ మహా సభల్లో పాల్గొన్నడం అదృష్టంగా భావిస్తున్నానని, రాబోయే రోజుల్లో మహేశ్వర మహా పిరమిడ్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎంపీ రాములు మాట్లాడుతూ ఎలాంటి ఫీజు లేకుండా ఎంతో మందికి ధ్యానం అందజేస్తున్న పత్రీజీ గొప్పవాడని, నిత్య ధ్యాన సాధనతో ఆనందమయం జీవితం పొందవచ్చని తెలిపారు. మహేశ్వర మహా పిరమిడ్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద పిరమిడ్‌ను కడ్తాల్ మండలంలో నిర్మించిన ట్రస్టు సభ్యులను ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ ధ్యానంతో మానసిక ఒత్తిడితో తగ్గుతుందని తెలిపారు. ధ్యాన మహాసభల్లో పాల్గొంటున్న ధ్యానులకు వసతులు కల్పిస్తున్న ట్రస్టు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. పిరమిడ్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పత్రీజీ మాట్లాడుతూ ధ్యానం సర్వరోగా నివారణి అని, సాముహిక ధ్యానంతో అద్భుత శక్తి వస్తుందని తెలిపారు. అనంతరం గవర్నర్‌కు సుభాశ్పత్రీజీ మెమోంటో అందజేసి, శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, ప్రముఖ కంటి వైద్యుడు సాయిబాబాగౌడ్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మన్యానాయక్, మహేశ్, శంకర్‌నాయక్, సాయిలాల్, భగీరథ, ట్రస్టు సభ్యులు స్వర్ణమాల, సాంబశివరావు, బాలకృష్ణ, శివప్రసాద్, హనుమంతరాజు, లక్ష్మీ, జయశ్రీ, సౌమ్యకృష్ణ, శ్రీరాంగోపాల్, రాంబాబు, ప్రేమయ్య, దామోదర్‌రెడ్డి, రవిశాస్త్రి, మాధవి, సాగర్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

