దుమారం రేపిన రాజాసింగ్ వీడియో..
హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్టు చేసిన ఓ వీడియో దుమారం రేపింది. ఆ వీడియోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు బుక్ చేశారు. సోమవారం రాత్రి నగరంలో ఓ వర్గం ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సిటీ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ఆఫీసుతో పాటు ఇతర ప్రదేశాల్లో ప్రదర్శనలు జరిగాయి. తమ మనోభావాలను రాజా సింగ్ అవమానించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే బషీర్‌భాగ్ వద్ద నిరసన చేపడుతున్న వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో కమీడియన్ మునావర్ ఫారూకి షో జరిగింది. అయితే దానిపై రాజాసింగ్ ఓ కామిడీ వీడియో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అంతకముందు మునావర్ షోను అడ్డుకుంటామని రాజా సింగ్ బెదిరించారు. ఆ సమయంలో అతన్ని హౌజ్ అరెస్టు చేశారు. హిందువుల మనోభావాలను మునావర్ కించపరిచినట్లు రాజాసింగ్ తన వీడియోలో ఆరోపించారు. చివరకు పోలీసుల విజ్ఞప్తితో రాజా సింగ్ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

