తొలి మ్యాచ్‌లో లక్నోపై గెలుపు
- గుజరాత్ ఘనంగా..
- మెరిసిన షమీ, తెవాటియా
- ఐపీఎల్ 15వ సీజన్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ఘనంగా బోణీ కొట్టింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో బరిలోకి దిగిన గుజరాత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడితే.. టాపార్డర్ వైఫల్యం కారణంగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ పరాజయంతో ప్రయాణం ప్రారంభించింది! బంతితో షమీ.. బ్యాట్‌తో తెవాటియా టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ముంబై: ఐపీఎల్ అరంగేట్రం చేసిన రెండు కొత్త జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ను విజయం వరించింది. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ (3/25) మెరుపులకు.. బ్యాటింగ్‌లో మిడిలార్డర్ సహకారం తోడవడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నీర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. క్వింటన్ డికాక్ (7), ఎవిన్ లూయిస్ (10), మనీశ్ పాండే (6) పెవిలియన్‌కు వరుస కట్టడంతో లక్నో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దీపక్ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోనీ (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3, వరుణ్ అరోన్ రెండు వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా షమీ టాపార్డర్‌ను గడగడలాడించాడు. పవర్‌ప్లేలోని తన తొలి మూడు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టి శభాష్ అనిపించుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 33; 5 ఫోర్లు, ఒక సిక్సర్), వేడ్ (30), మిల్లర్ (30), రాహుల్ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (7 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. లక్నో బౌలర్లలో చమీర 2 వికెట్లు పడగొట్టాడు. షమీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ ఆడనుంది.
అన్న బౌలింగ్‌లో తమ్ముడు ఔట్..
ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చి.. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. తన బౌలర్లను సమర్థవంతంగా వినియోగించుకున్న పాండ్యా బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనిపించాడు. చాన్నాళ్ల తర్వాత తన కోటా పూర్తి చేసిన హార్దిక్.. 37 పరుగులు ఇచ్చుకున్నాడు. మొదటి రెండు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చిన పాండ్యా.. ఆ తర్వాత రెండు ఓవర్లలో భారీగా రన్స్ సమర్పించుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్సీ భారం వల్ల ఏమో కానీ కాస్త నిదానంగా ఆడిన పాండ్యా.. ఆఖరికి తన సోదరుడు కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔట్ కావడం కొసమెరుపు!
గిల్ సూపర్మ్యాన్లా..
టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్.. తొలి మ్యాచ్‌లోనే సూపర్ క్యాచ్‌తో అదుర్స్ అనిపించుకున్నాడు. అరోన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి లూయిస్ స్కేర్ లెగ్ వైపు భారీ షాట్ ఆడగా.. దాదాపు 25 అడుగులు వెనక్కి పరిగెడుతూ గిల్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. 1983 ప్రపంచకప్ ఫైనల్లో కపిల్‌దేవ్ క్యాచ్‌ను తలపించిన గిల్ ఫీట్ పై సామాజిక మాద్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 158/6 (దీపక్ హుడా 55, ఆయుష్ బదోనీ 54; షమీ 3/25, అరోన్ 2/45), గుజరాత్: 19.4 ఓవర్లలో 161/5 (తెవాటియా 40 నాటౌట్, హార్దిక్ 33; చమీర 2/22).
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Aaron
- Ayush Badoni
- Deepak Hooda
- ipl
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

