వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయాలని భావించారు. అదే రోజు ‘భీమ్లానాయక్’ రిలీజ్ ఉన్నందున ‘గని’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘త్వరలోనే కొత్త తేదీని తెలియజేస్తాం. బాక్సింగ్ నేపథ్యంలో సాగే భావోద్వేగభరిత చిత్రమిది. వరుణ్‌తేజ్ పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఓ సామాన్య యువకుడు గొప్ప లక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. పాటలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి’ అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, సునీల్‌శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం: తమన్, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.