స్టాక్‌హోమ్: కరోనా ఉద్ధృతి కారణంగా చాలా దేశాల్లో ఇంట్లో నుంచి బయటకు వస్తే వ్యాక్సిన్ ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతీసారి సర్టిఫికెట్‌ను తీసుకెళ్లడం కుదరకపోవచ్చు. దీనికి స్వీడన్‌లోని ఎపిక్‌సెంటర్ అనే స్టార్టప్ కంపెనీ చక్కని పరిష్కారాన్ని కనుగొన్నది. బియ్యపు గింజ సైజులో, శరీరంలో ఇట్టే కలిసిపోయే ఓ మైక్రో చిప్‌ను కంపెనీ ప్రతినిధులు సృష్టించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ వివరాలను ఇందులో నిక్షిప్తం చేశారు. చిప్ ఉన్న చెయ్యిని ఫోన్‌తో స్కాన్ చేయగానే ప్రాసెసింగ్ మొదలవుతుంది. క్షణాల్లో మన వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఫోన్ లేదా ఇతరత్రా డివైజ్‌లో ప్రత్యక్షం అవుతుంది. దీని కోసం నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ సాంకేతికతను వినియోగించారు. సెక్యూరిటీ, పేమెంట్స్ వంటి భద్రతాపరమైన రంగాల్లో ఈ చిప్ ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని కంపెనీ తెలిపింది.