Hathras | హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
Hathras | ఉత్తరప్రదేశ్ హథ్రాస్ (Hathras) జిల్లాలోని రతిభాన్పూర్లో నిర్వహించిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను యూపీ సీఎం (Uttar Pradesh CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) పరామర్శించారు.
Hathras | ఉత్తరప్రదేశ్ హథ్రాస్ (Hathras) జిల్లాలోని రతిభాన్పూర్లో నిర్వహించిన శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 121 మంది ప్రాణాలు కోల్పోయారు. 28 మంది గాయపడ్డారు. వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై యూపీ సీఎం (Uttar Pradesh CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం హథ్రాస్‌కు చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath meets and inquires about the health of the persons injured in the stampede incident, at Hathras government hospital pic.twitter.com/HW5u4q4ziv
— ANI (@ANI) July 3, 2024
పరారీలో బోలే బాబా
మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా ఆనవాళ్లు దొరకడం లేదు. ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ బాబా కోసం వెతుకులాట ప్రారంభించారు. ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసిన తర్వాత బాబా వాహనం వెంట జనం ఉరికినట్లు తెలుస్తోంది. బాబా నడిచిన ప్రదేశంలోని మట్టిని తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అనుచరులు ఎగబడ్డారు. ఆ సమయంలోనే తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. మట్టి కోసం కిందకు వంగిన సమయంలో జనం ఒకరిపై ఒకరు పడ్డారు.
ఓ గ్రామ పరిసరాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు రెండున్నర లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది. నిజానికి 80 వేల మంది వరకే పర్మిషన్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కేవలం 40 మంది పోలీసులు మాత్రమే రక్షణ విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
అసలు ఎవరీ బోలే బాబా
భోలే బాబా అసలు పేరు నారాయణ్ హరి. ఆయన్ను సూరజ్ పాల్ సింగ్‌గా కూడా గుర్తిస్తారు. తనను తాను దేవుడికి శిష్యుడిగా ప్రకటించుకొని ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తుంటాడు. ఈయన స్వస్థలం యూపీలోని ఈటా జిల్లాలో బహదూర్ గ్రామం. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)లో పనిచేసినట్లు ఆయనే చెప్పుకున్నారు. ఆధ్యాత్మిక జీవితం కోసం 26 ఏండ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేశానని చెబుతుంటాడు. ఆయన అనుచరులు అలీగఢ్‌లో ప్రతి మంగళవారం సత్సంగ్ నిర్వహిస్తుంటారు. కాషాయ వస్త్రాలు ధరించకుండా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ.. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయటం ఈయన స్టెల్. ఖరీదైన అద్దాలు, తెల్లని సూట్, టై ధరించి ఈయన నిర్వహించే ‘సత్సంగ్’ కార్యక్రమాలకు పశ్చిమ యూపీలో భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath meets the injured in the stampede incident, at Hathras government hospital
121 people lost their lives in a stampede during a religious event in Hathras yesterday pic.twitter.com/mDpTLBxpL2
— ANI (@ANI) July 3, 2024
Also Read..
Vijay Thalapathy | నీట్‌పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.. ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం : హీరో విజయ్
Bhole Baba: భోలే బాబా అసలు పేరేంటి ?.. హాథ్రాస్ తొక్కిసలాటపై ఎఫ్ఐఆర్ నమోదు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

