లండన్, సెప్టెంబర్ 16: బ్రెయిన్ క్యాన్సర్‌కు కారకమయ్యే కణాలను అంతం చేసే ఓ స్ప్రేను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హామ్ పరిశోధకులు ఈ మేరకు గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్‌కు కొత్త చికిత్సను కనుగొన్నారు. బయో నానోయాంటెన్నాలు కలిగిన స్ప్రేను ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ కణాలను అంతమొందిచవచ్చని పరిశోధకులు తెలిపారు.
ఈ బయో నానోయాంటెన్నాలు ఎలక్ట్రికల్ ఫీల్డ్స్‌ను బయో లాజికల్ సిగ్నళ్లుగా మార్చి కణాల పని పడతాయని పేర్కొన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ కారణంగా అమెరికాలో ఏటా 10 వేల మంది మరణిస్తున్నారు.