హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): అమెరికా వీసా రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి యూఎస్ కాన్సులేట్ మరో శుభవార్త చెప్పింది. ‘క్లియరెన్స్ రిసీవ్డ్’ లేదా ‘డిపార్ట్మెంట్ ఆథరైజేషన్’ సర్టిఫికెట్ ఉన్నవారికి ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నది. వారు నేరుగా వీసా తీసుకోవచ్చని పేర్కొన్నది.