చైనా ఒలింపిక్స్ బాయ్‌కాట్‌కు అమెరికా స్పీకర్ పెలోసీ పిలుపు

వాషింగ్టన్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో జరిగే శీతాకాల ఓలింపిక్స్ను బహిష్కరించాలని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకుగానూ చైనా ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా వెలివేయాలని అన్నారు. ఆ ఒలింపిక్స్‌కు ప్రపంచనేతలు ఎవరూ హాజరు కావద్దని కూడా పెలోసీ అన్నారు. అయినా వారు వెళితే నైతిక బలాన్ని కోల్పోయినట్టు అవుతుందని అన్నారు. చైనా ఓలింపిక్స్ను బహిష్కరించడమో లేక ఓలింపిక్స్ను అక్కడి నుంచి వేరేచోటికి మార్చడమో చేయాలని అమెరికా చట్టసభల ప్రతినిధులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఉయ్ఘుర్లను, ఇతర మైనారిటీలను చైనా ఊచకోత కోస్తున్నదని, దీనిపై అమెరికా కార్పోరేట్ల మౌనం చైనాను ప్రోత్సహించేదిగా ఉందని వారు అంటున్నారు. కాంగ్రెస్ ద్విపక్ష కమిటి ముందు హాజరైన పెలోసి కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కీలకస్థానంలో ఉన్న పెలోసీ అభిప్రాయానికి చాలా విలువ ఉంటుంది. పైగా ఇప్పుడున్నది డెమొక్రాటిక్ ప్రభుత్వమే కనుక బహిష్కరణ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

