ల్వీవ్: రష్యా దాడుల్లో అమెరికాకు చెందిన వీడియో జర్నలిస్టు బ్రెంట్ రేనాడ్ మృతిచెందగా, జువాన్ అరెడొండో అనే మరో జర్నలిస్టుకు గాయాలయ్యాయి. ఉక్రెయిన్‌లోని కీవ్ సమీప ఇర్పిన్ పట్టణంలో ఒక చెక్‌పాయింట్ దగ్గర జర్నలిస్టులు ప్రయాణిస్తున్న కారును అడ్డుకొన్న రష్యా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో గాయాలపాలైన జువాన్‌ను చికిత్స నిమిత్తం కీవ్‌లోని దవాఖానకు తరలించారు. ఇర్పిన్ ప్రాంతాన్ని వదిలి వెళ్తున్న పౌరులను చిత్రీకరిస్తున్న సమయంలో రష్యా సేనలు కాల్పులకు పాల్పడ్డాయని జువాన్ తెలిపారు. 50 ఏండ్ల రేనాడ్ న్యూయార్క్ టైమ్స్‌కు పనిచేశారని, చనిపోయిన సమయంలో పత్రిక తరపున డ్యూటీలో లేరని ఆ సంస్థ పేర్కొన్నది.