UPSC Prelims Result 2023 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్స్ ప్రిలిమ్స్ (Civil Services Prelims 2023) ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది మే 28న సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ (Civil Services Prelims 2023) నిర్వహించగా, 16 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. 14,624 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ప్రకటించారు. వీరంతా ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్ (Civils Mains) పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ఈ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం డీఏఎఫ్ -1 (Detailed Application Form-I)లో దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది.
ఐఏఎస్(IAS), ఐఎఫ్ఎస్(IFS), ఐపీఎస్(IPS) తదితర సర్వీసుల కోసం అభ్యర్థులను ప్రతి ఏడాది యూపీఎస్సీ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే.