Afghanistan | బలగాలు, పౌరుల తరలింపుపై గడువుపై స్పష్టతనిచ్చిన అమెరికా
Afghanistan | బలగాలు, పౌరుల తరలింపుపై గడువుపై స్పష్టతనిచ్చిన అమెరికా | ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల తరలింపు గడువుపై అమెరికా స్పష్టతనిచ్చింది. పౌరులతో పాటు ఆఫ్ఘన్ వాసుల తరలింపునకు గడువేమీ లేదని చెప్పింది. ఈ నెల 31 తర్వాత కూడా తరలింపు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ తెలిపారు.

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల తరలింపు గడువుపై అమెరికా స్పష్టతనిచ్చింది. పౌరులతో పాటు ఆఫ్ఘన్ వాసుల తరలింపునకు గడువేమీ లేదని చెప్పింది. ఈ నెల 31 తర్వాత కూడా తరలింపు కొనసాగుతుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. ఆయన స్టేట్ డిపార్ట్మెంట్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆఫ్ఘన్లో ఇంకా 1500 మంది అమెరికన్లు తరలింపు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఈ నెల 14న ఎయిర్‌లిఫ్ట్ ప్రారంభం కాగా.. దాదాపు ఆరువేల మందిని అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయలుదేరారన్నారు.
ఇందులో దాదాపు 4,500 మందిని ఖాళీ చేయించినట్లు చెప్పారు. చాలా మంది భయపడుతున్నారని, చివరి రోజున అమెరికా మరో 500 మంది పౌరులను సంప్రదించిందని, విమానాశ్రయానికి ఎలా చేరుకోవాలో వారికి చెప్పినట్లు తెలిపారు. అలాగే మరో వెయ్యి మంది అమెరికన్లను సైతం సంప్రదిస్తున్నామని.. కాన్సులర్ సిబ్బంది అనేకసార్లు ఫోన్లు, మెసేజ్‌లు, ఈ-మేయిల్స్ ద్వారా వారిని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే, తరలింపు ప్రక్రియ ఈ నెల 31తో ముగియదని.. ఆఫ్ఘన్ నుంచి బయపడే వ్యక్తులను తీసుకువచ్చేందుకు అవసరమైన సహాయం అందించేంత వరకు కొనసాగుతుందని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

