పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం భగవద్గీత. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. గీత సకల ఉపనిషత్తుల సారం. మరి ఇందులో ఏం రహస్యాలున్నాయో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. గీతను ఎలా చదివితే మన జీవితం ఆనందమయమవుతుందో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అలాంటి వారికోసమే గీతలోని రహస్యాలు చెప్పారు హెచ్జీ సత్యగౌర చంద్రదాస. మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకోండి.