ముద్దు పెట్టుకున్న మంత్రిపై ప్రధానికి విశ్వాసం..
బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ క్షమాపణను బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అంగీకరించారు. అతనిపై పూర్తి విశ్వాసం ఉన్నదని జాన్సన్ ప్రతినిధి వెల్లడించారు.

లండన్: బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ క్షమాపణను బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అంగీకరించారు. అతనిపై పూర్తి విశ్వాసం ఉన్నదని జాన్సన్ ప్రతినిధి వెల్లడించారు. హాంకాక్ తన సహాయకురాలిని ముద్దుపెట్టుకున్న వార్త బయటకు రావడంతో మంత్రిపదవికి రాజీనామా చేయాలంటూ ఒత్తిళ్లు వచ్చాయి.గత సంవత్సరం తన సహాయకురాలిని ముద్దుపెట్టుకుని, ఆలింగనం చేసుకున్న చిత్రాలు సన్ వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రచురించారు. ఈ విషయం సీరియస్‌గా మారి ఆయన రాజీనామా చేయాలంటూ ఆందోళన చేసేంత వరకు దారితీశాయి. దాంతో హాంకాక్ క్షమాపణలు కోరారు.
“ఆరోగ్య కార్యదర్శి క్షమాపణను ప్రధాని బోరిస్ జాన్సన్ అంగీకరించారు. ఈ విషయాన్ని ఇంతటితో మూసివేసినట్లు భావిస్తున్నారు” అని ప్రధానమంత్రి ప్రతినిధి చెప్పారు. హాంకాక్పై జాన్సన్‌కు పూర్తి విశ్వాసం ఉన్నదని తెలిపారు. కొవిడ్-19 మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు అంగీకరించిన తర్వాత హాంకాక్ పదవిలో ఉండటం సరైనదా అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రతినిధి నిరాకరించారు. ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉండటం వలన చెడు మార్గాలను చూపినట్లవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ హాంకాక్తో జాన్సన్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

