సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా
సహాయకురాలికి ముద్దిచ్చి వివాదాస్పదంగా మారిన బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ ఎట్టకేలకు రాజీనామా చేశారు.

లండన్ : సహాయకురాలికి ముద్దిచ్చి వివాదాస్పదంగా మారిన బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాంకాక్ ఎట్టకేలకు రాజీనామా చేశారు. అంతకుముందు, హాంకాక్ చేసిన విజ్ఞప్తిని మన్నించిన బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అతడిని క్షమించారు. అయితే, విపక్షాల నుంచి ముప్పేటదాడి తప్పకపోవడంతో తప్పనసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి హాంకాక్ రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో నిబంధనలను అతిక్రమించి సహాయకురాలిని ముద్దుపెట్టుకున్నారని మాట్ హాంకాక్పై ఆరోపణలు ఉన్నాయి. హాంకాక్ ముద్దు భాగోతాన్ని సన్ వార్తాపత్రిక మొదటి పేజీలో ప్రధానంగా ప్రచురించింది. ఈ విషయం సీరియస్‌గా మారడంతో తనను క్షమించాలంటూ ప్రధానికి హాంకాక్ లేఖ రాశారు. దాంతో ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ కూడా శనివారం ఉదయం ప్రకటించారు.
కొవిడ్ మహమ్మారి మార్గదర్శకాలను పట్టించుకోకుండా కార్యాలయంలో సహాయకురాలిని ముద్దుపెట్టుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దాంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని హాంకాక్ నిర్ణయించుకున్నారు. ‘వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రజలు చేస్తున్న త్యాగాలు చూస్తే.. మనం వారికి ఏదైనా తప్పు చేస్తే.. నిజాయితీగా ఉండటం మన బాధ్యత అవుతుంది’ అని తన రాజీనామా లేఖలో హాంకాక్ పేర్కొన్నారు.
ఇలాఉండగా, 42 ఏండ్ల వయసున్న హాంకాక్, 15 ఏండ్ల క్రితం పెండ్లి చేసుకున్నాడని, భార్య మార్తతో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యారని సన్ పత్రిక తన కథనంలో తెలిపింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సహవిద్యార్థిగా ఉన్న సమయంలో పరిచయంతో హాంకాక్ ఆమెను తన సహాయకురాలిగా నియమించుకున్నారని, ఆమెను పెండ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం ఉన్నదని ది సన్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. తనతో హాంకాక్ ముద్దు సీన్ వివాదం కావడంతో హాంకాక్ కన్నా ముందే ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా తెలిసింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరోగ్య శాఖలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదా ఉద్యోగంలో ఆమెను గత ఏడాది సెప్టెంబర్ నెలలో హాంకాక్ నియమించారు. ఏడాది కాలంలో 15-20 రోజులు మాత్రమే పనిచేసేలా, 15,000 పౌండ్ల జీతంతో ఆమెను హాంకాక్ నియమించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
హాంగ్‌కాంగ్ యాపిల్ డెయిలీ మూసివేత
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

